హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకొని ఉంటే బతికేవాడు!

ABN , First Publish Date - 2020-09-16T18:43:55+05:30 IST

నగరంలోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.

హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకొని ఉంటే బతికేవాడు!

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో టిప్పర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజయ్ బిస్వాస్(38) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఐటీ విభాగం సందేశాత్మక ట్వీట్ చేసింది. హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకొని ఉండి ఉంటే... వ్యక్తి మృతి చెంది ఉండేవాడు కాదని ఫొటోలతో సహా ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది. హెల్మెట్ ప్రాధాన్యాన్ని ఈ విధంగా చెప్పకనే చెప్పింది.  


హెల్మెట్ రక్షణ కవచమని పోలీసులు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయినా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. హెల్మెట్‌ ధరించడంవల్ల కలిగే ఉపయోగాలను ప్రజలు గమనించడం లేదని వాపోతున్నారు. కొంతమంది నాణ్యత లేని హెల్మెట్లు ధరించడం కూడా మరణాలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-09-16T18:43:55+05:30 IST