జీహెచ్ఎంసీ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది: లోకేష్‌కుమార్

ABN , First Publish Date - 2020-09-17T23:50:36+05:30 IST

రాబోయే మూడు గంటల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని

జీహెచ్ఎంసీ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది: లోకేష్‌కుమార్

హైదరాబాద్: రాబోయే మూడు గంటల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. అత్యవసర సహాయానికి జీహెచ్ఎంసీ టోల్‌ఫీ నంబర్లను 040-21111111, 040-29555500 సంప్రదించాలని లోకేష్‌కుమార్ తెలిపారు. 


బుధవారం భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులతో కుండపోతగా కురిసి.. బీభత్సం సృష్టించింది. బుధవారం పగలంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయి రెండు గంటల్లోనే 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ వరదకాలువలను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మోకాలిలోతుకు పైగా నీరు నిలవడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు అదుపుతప్పి కిందపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. పురాతన భవనాల గోడలు కూలాయి. ఫీర్జాదిగూడ చెరువు కట్టపై ఆలయం ప్రహరీగోడ కూలి.. బైక్‌పై పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గురువారం కూడా జీహెచ్ఎంసీ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ప్రకటించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-09-17T23:50:36+05:30 IST