వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-08-16T15:55:17+05:30 IST

భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.

వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు

భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వరంగల్, కరీంనగర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పొలాలు, రోడ్లు, వాగులు, చెరువులు.. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా పట్టిన ముసురు వదలడంలేదు సరికదా.. అప్పటి వరకు సన్నగా కురుస్తున్న జల్లుల్లో వేగం పెరిగింది. గంటల తరబడి కురిసిన వర్షానికి వరద పోటెత్తింది. 


పొలం పనులకు వెళ్లిన కూలీలు, పశువులు మేపేందుకు పోయిన కాపర్లు, వంతెనలవద్ద వాహనదారులు నడుమ వరకు వచ్చిన నీళ్ల మధ్య చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. వరినాట్లు మునిగి పొలాలు, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు చెరువులను తలపించాయి. చెరువులు పూర్తిగా నిండి అలుగులుపొస్తున్నాయి. కొన్ని చోట్ల గండ్లు పడతాయనే భయంతో చెరువు మత్తళ్లను తవ్వేశారు. పోటెత్తిన వరదలకు కొన్ని చోట్ల నిండు ప్రాణాలు బలయ్యాయి. పలుచోట్ల మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయి.

Updated Date - 2020-08-16T15:55:17+05:30 IST