భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ABN , First Publish Date - 2020-10-13T18:36:33+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామాలకు నిలిచిన రాకపోకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకల అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. దీంతో దిగువన ఉన్న గుమ్మడివల్లి, రంకపురం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నారాయణపురం గ్రామంలో పెద్దవాగు ప్రాజెక్టు దగ్గర వరి పంటలు నీటమునిగాయి. సమీపంలో ఉన్న పశువులు గల్లంతు అయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-10-13T18:36:33+05:30 IST