హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2020-08-01T21:12:28+05:30 IST

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం కురిసింది. అంతేకాకుండా ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఉప్పల్‌, రామాంతాపూర్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 


 ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు సీజనల్‌ వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. విరివిగా వర్షాలు పడుతుండడంతో అనేకమంది మంచాన పడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ, మలేరియా, డయేరియాతో పాటు సాధారణ జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-08-01T21:12:28+05:30 IST