భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-29T01:13:57+05:30 IST

పోలీసులు తనిఖీలు చేపట్టారు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని మహాదేవపురంలో ..

భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌:  నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని మహాదేవపురంలో భారీగా గంజాయి, బంగ్‌, హుక్కా ఈ తనిఖీల్లో పట్టుబడింది. పోలీసులు గంజాయి, బంగ్‌, హుక్కాని స్వాధీన చేసుకున్నారు.  ఈకేసులో యువకుడు వినోద్‌(25)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  నిందితుడి దగ్గరి నుంచి 400 గ్రాముల గంజాయి, బంగ్‌, హుక్కా పాట్‌ స్వాధీనం పరుచుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం వీటిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2020-12-29T01:13:57+05:30 IST