మద్యం కోసం డబ్బులివ్వలేదని తండ్రిని చంపాడు

ABN , First Publish Date - 2020-05-13T09:37:21+05:30 IST

మద్యానికి బానిసైన ఓ కుమారుడు డబ్బు కోసం తండ్రిని చంపాడు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామంలో సోమవారం రాత్రి

మద్యం కోసం డబ్బులివ్వలేదని తండ్రిని చంపాడు

కట్టంగూరు, మే 12: మద్యానికి బానిసైన ఓ కుమారుడు డబ్బు కోసం తండ్రిని చంపాడు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం కొనేందుకు వృద్ధాప్య పింఛను ఇవ్వాలని నూకల గంగయ్య(75)ను కుమారుడు బిక్షం వేధించాడు. ఆయన ఇవ్వననడంతో రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గంగయ్యను స్థానికులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. జులాయిగా తిరిగే బిక్షం గతంలో భార్యపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటోంది. ఇంట్లో తండ్రి గంగయ్య, కుమారుడు బిక్షం ఉంటున్నారు.  

Read more