వరంగల్‌లో ఒక్క పాజిటివ్ కేసూ లేదు: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-03-24T18:33:12+05:30 IST
ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.

వరంగల్: ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలను ప్రజలు నిర్బంధించుకోవడం శుభపరిణామమని అన్నారు. క్వారంటైన్‌లో ఉండని వారి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. భూపాలపల్లి జిల్లాలో 34 మంది అనుమానితులు ఉన్నారని, మహబూబాబాద్‌లో 101 మంది విదేశాల నుంచి వచ్చారు.. కానీ ఎవరికీ పాజిటివ్ రాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.