‘హరితహారంతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ’

ABN , First Publish Date - 2020-06-24T02:20:26+05:30 IST

హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు పాటుపడుతున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నర్సాపూర్ నుండి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని

‘హరితహారంతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ’

హైదరాబాద్: హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు పాటుపడుతున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నర్సాపూర్ నుండి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతుందన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గత పాలకుల పాలనలో అడవులను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో అటవీ సంపద తరిగిపోయిందన్నారు. అడవుల పునరుద్ధరణలో భాగంగా మెదక్ జిల్లాలో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 20వేల ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగిందని హరీష్ రావు తెలిపారు. ఈ ఏడాది 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి భూముల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతామని మంత్రి తెలిపారు. అడవి భూములలో హరితహారం మొక్కలు నాటడంతో పర్యావరణ పరిరక్షణ చేసినవాళ్లము అవుతామన్నారు. వన్యప్రాణుల కోసం పండ్ల మొక్కలు సైతం నాటుతామన్నారు.

Updated Date - 2020-06-24T02:20:26+05:30 IST