కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో హరిత శుక్రవారం

ABN , First Publish Date - 2020-05-09T00:15:34+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో హరిత శుక్రవారం కార్యక్రమం స్పూర్తిని నింపింది.

కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో హరిత శుక్రవారం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో హరిత శుక్రవారం కార్యక్రమం స్పూర్తిని నింపింది. గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలో హరిత శుక్రవారం నిర్వహించాలని, తెలంగాణ హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటి సౌకర్యాన్నికల్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.న ఈనేపధ్యంలో ఆయా జిల్లాల్లో గ్రామీణాభివ్ధృధ్ది, అటవీశాఖలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు రంగంలోకి దిగారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతి పంచాయితీకి ఇచ్చిన కొత్త ట్రాక్టర్లతో నీటిని తరలించి మొక్కలకు సరఫరా చేశారు. 


వేసవి తీవ్రత బాగా ఉన్నప్పటికీ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. తెలంగాణ హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటి సౌకర్యం ఏర్పాటు పై జిల్లాల వారీగా కొనసాగిన తీరును ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ ప్రియాక వర్గాస్‌ పర్యవేక్షించారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని స్వయంగా కలెక్టర్లుపర్యవేక్షించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ వీలైనంత మంది పాల్గొనేలా ఎక్కువ మొక్కలకు నీటిని అందించేలా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. నీటి సరఫరా జరిగేలా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు సమన్వయంతో ముందుకు పోవాలని ప్రియాంకావర్గీస్‌ సూచించారు. వచ్చే హరితహారం సీజన్‌ కోసం వీలైన ంత పెద్దమొక్కలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2020-05-09T00:15:34+05:30 IST