నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-06-25T20:40:12+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోవిడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెదక్‌జిల్లా నర్సాపూర్‌ నుంచి శ్రీకారం చుట్టారు.

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోవిడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెదక్‌జిల్లా నర్సాపూర్‌ నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం ఆయన ఇక్కడి ఆర్బన్‌పారెస్ట్‌పార్కులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని, తద్వారా హరిత తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T20:40:12+05:30 IST