ట్విటర్‌లో పేరు మార్చుకున్న హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-04-28T10:25:35+05:30 IST

ట్విటర్‌లో పేరు మార్చుకున్న హరీశ్‌రావు

ట్విటర్‌లో పేరు మార్చుకున్న హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు తన ట్విటర్‌ ఖాతా పేరును మంత్రి హరీశ్‌రావు మార్చుకున్నారు. హరీశ్‌రావు తన్నీరు అని ఇన్నాళ్లుగా ఉన్న పేరుకు ‘స్టే హోం’, ‘స్టే సేఫ్‌’ హాష్‌ట్యాగ్‌లను జత చేశారు. కాగా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. తాను మాస్కు ధరించిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

Updated Date - 2020-04-28T10:25:35+05:30 IST