అభాగ్యులకు మంత్రి హరీశ్‌ అండ

ABN , First Publish Date - 2020-05-09T09:37:45+05:30 IST

చెట్టునీడనే 47 రోజులుగా ఉంటున్న వలస కుటుంబం గురించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలోని బస్టాండ్‌ సమీపంలో ఓ చెట్టుకింద ఉన్న వలస కుటుంబం వద్దకు టీఆర్‌ఎస్

అభాగ్యులకు మంత్రి హరీశ్‌ అండ

సిద్దిపేట, మే 8 (ఆంధ్రజ్యోతి): చెట్టునీడనే 47 రోజులుగా ఉంటున్న వలస కుటుంబం గురించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలోని బస్టాండ్‌ సమీపంలో ఓ చెట్టుకింద ఉన్న వలస కుటుంబం వద్దకు టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డిని పంపించారు. వారిని సిద్దిపేటలోని నైట్‌షెల్టర్‌కు తరలించారు. అవసరమైన నిత్యావసరాలు అందించి, భవన నిర్మాణ పనుల్లో ఉపాధి కల్పించారు. తమ దీనగాథను వెలుగులోకి తెచ్చిన ’ఆంధ్రజ్యోతి’కి, మంత్రి హరీశ్‌రావుకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-05-09T09:37:45+05:30 IST