సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-11-08T02:10:22+05:30 IST

సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ నెల 10లోగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం: హరీశ్‌రావు

హైదరాబాద్: సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ నెల 10లోగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ విలీన గ్రామాలకు కూడా సాదా బైనామా వర్తిస్తుందని హరీశ్‌రావు తెలిపారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై చేసుకున్న ఒప్పందాల(సాదా బైనామాల) క్రమబద్ధీకరణ గ్రామాల్లోనే అమలు కానుంది. పట్టణాల్లోని భూముల సాదా బైనామాలు చెల్లవని ప్రభుత్వం పేర్కొంది. అయితే పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నప్పటికీ.. రెవెన్యూశాఖ మినహాయింపు జాబితాలో ఉన్న గ్రామాల్లోని భూములకు మాత్రం అవకాశం కల్పించింది. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-1971 ఆధారంగానే సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 12న జీవో నెం.111ను జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-11-08T02:10:22+05:30 IST