‘టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ చూడలేకే ఎమ్మెల్యేపై దాడి’
ABN , First Publish Date - 2020-11-03T21:20:42+05:30 IST
టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ చూడలేకే ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారని..
సిద్ధిపేట: టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ చూడలేకే ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బీజేపీకి తగిన విధంగా బుద్ది చెబుతారని అన్నారు. బీజేపీ నాయకులు క్రాంతి కిరణ్ ఉంటున్న స్థలానికి వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో ఆయనపై దాడికి పాల్పడ్డారని మంత్రి తెలిపారు. పోలీసులు వెళ్లి, పూర్తి స్థాయిలో సోదాలు చేసి, అక్కడ ఎలాంటి ప్రచార సామాగ్రి లేదని చెప్పి వెళ్లిపోయిన తర్వాత బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు. క్రాంతి కిరణ్ ఎలాంటి ప్రచారానికి పాల్పడకుండా ఆయన రూంలో ఉండి ఎన్నికల సరళిని సమీక్షిస్తుంటే.. ఒక పథకం ప్రకారం బీజేపీ నేతలు దాడి చేశారని హరీష్ రావు తెలిపారు.