నోముల ఆకస్మిక మరణం దురదృష్టకరం: హరీష్‌రావు
ABN , First Publish Date - 2020-12-01T14:04:39+05:30 IST
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు స్పందించారు.

హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు స్పందించారు. నోముల ఆకస్మిక మరణం దురదృష్టకరమన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలాగే నోముల కుటుంబానికి హరీష్‌రావు సానుభూతి తెలిపారు. ‘‘నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకరం. జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్యగారు. వారిమృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంభసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని హరీష్ రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.