ఆర్థిక మాంద్యానికి విరుగుడు అదే: హరీశ్‌రావు
ABN , First Publish Date - 2020-03-08T18:13:12+05:30 IST
ప్రభుత్వ ప్రణాళిలు సుదర్ఘీమైనవని చెప్పిన హరీశ్‌రావు వచ్చే నాలుగు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్లో కోత విధించలేదని, పైగా సంక్షేమ పథకాల్లో

హైదరాబాద్: దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నా తెలంగాణ ప్రజలపై ఆ ప్రభావం పడకుండా తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆర్థిక మాంద్యానికి విరుగుడు కొనుగోలు శక్తిని పెంచడమే అని తెలిపిన ఆయన ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం దీర్ఘ ప్రణాళికలు చేసిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రణాళిలు సుదర్ఘీమైనవని చెప్పిన హరీశ్‌రావు వచ్చే నాలుగు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్లో కోత విధించలేదని, పైగా సంక్షేమ పథకాల్లో లబ్దిదారులను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ను ప్రజలే కేంద్రంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.