తాత బాగున్నవా? పింఛన్‌ వస్తుందా?

ABN , First Publish Date - 2020-04-05T07:45:03+05:30 IST

‘‘తాత బాగున్నావా?.. ఊర్లో ఏమనుకుంటున్నారు?.. కేసీఆర్‌ ఇచ్చే పింఛన్‌ వస్తుందా?..’’ అంటూ ఓ రైతును మంత్రి హరీశ్‌రావు పలకరించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లిలో...

తాత బాగున్నవా? పింఛన్‌ వస్తుందా?

  • గాజులపల్లిలో రైతును పలకరించిన హరీశ్‌

దౌల్తాబాద్‌/మెదక్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘‘తాత బాగున్నావా?.. ఊర్లో ఏమనుకుంటున్నారు?.. కేసీఆర్‌ ఇచ్చే పింఛన్‌ వస్తుందా?..’’ అంటూ ఓ రైతును మంత్రి హరీశ్‌రావు పలకరించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లిలో శనివారం సాయంత్రం పర్యటించిన హరీశ్‌.. కరోనా వైరస్‌ పట్ల ఏమనుకుంటున్నారంటూ రైతు వద్ద ఆరా తీశారు. రేషన్‌ బియ్యం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇందుకు ఆ రైతు..‘‘బియం్య ఇస్తున్నారు సార్‌.. ఇళ్లలోనే ఉంటున్నాం’’అని బదులిచ్చారు. అంతకుముందు మెదక్‌ జిల్లా కేంద్రంలో హరీశ్‌ సుడిగాలి పర్యటన జరిపారు. పట్టణంలోని ఓ రేషన్‌ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి,  సక్రమంగా బియ్యం అందుతున్నాయా? లేదా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.


Updated Date - 2020-04-05T07:45:03+05:30 IST