కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి.. హర్షం వ్యక్తం చేసిన హరీశ్
ABN , First Publish Date - 2020-04-26T20:34:09+05:30 IST
జిల్లాలో కరోనా అనుమానిత కేసులన్నీ నెగిటివ్‌గా తేలడంతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి: జిల్లాలో కరోనా అనుమానిత కేసులన్నీ నెగిటివ్ అని తేలడంతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆలయాలు, చర్చ్, మసీదులు మూసేసిన ఈ సమయంలో.. ప్రత్యక్ష దైవాలుగా వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారని వ్యాక్యానించారు. జిల్లాలోని అన్ని కరోనా కేసులు నెగిటివ్‌గా రావడంతో కరోనా ఫ్రీ జిల్లాగా మారిందన్నారు. అయినా నిర్లక్ష్యం వహించకుండా భౌతిక దూరం పాటించాలని, వైద్య శాఖలో క్షేత్ర స్థాయిలో పని చేసే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఆరోగ్య చిట్కాలు ఊరూరా వివరించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్‌లు ఉండే ఆహార పదార్థాలనే తినాలన్నారు.