తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై హరీష్ రావు స్పందన

ABN , First Publish Date - 2020-03-08T17:45:09+05:30 IST

తెలంగాణ ఏర్పాటు తరువాత రెండో దఫా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావు.. తొలిసారి రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు తన సంతోషాన్ని

తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై హరీష్ రావు స్పందన

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు తరువాత రెండో దఫా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావు.. తొలిసారి రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. కాగా, అసెంబ్లీకి వచ్చే ముందు హరీష్ రావు బడ్జెట్ ప్రతులతో గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. తెలంగాణలో రెండోదఫా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. 2019-20 బడ్జెట్‌ను అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-08T17:45:09+05:30 IST