సాధారణ వైద్యానికి కష్టకాలం

ABN , First Publish Date - 2020-07-22T10:05:52+05:30 IST

అసలే కరోనా కష్టకాలం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ఇతర రోగుల సంఖ్య అంతంత మాత్రమే.

సాధారణ వైద్యానికి కష్టకాలం

  • ప్రభుత్వ ఆస్పత్రులకొచ్చే ఇతర రోగులు వెనక్కే!..
  • ఆయాసం, జ్వరం ఉందంటే సిబ్బంది ఆమడ దూరం
  • అత్యవసర చికిత్సకూ వైద్య సిబ్బంది నిరాకరణ
  • గర్భిణులకు మరింత గడ్డుకాలం 


హైదరాబాద్‌ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): సలే కరోనా కష్టకాలం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ఇతర రోగుల సంఖ్య అంతంత మాత్రమే. వచ్చిన వారికైనా వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. దీంతో అత్యవసర చికిత్స కోసం చాలా మం ది ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలను ఆ శ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గాంధీ ఆస్ప త్రి, కింగ్‌కోఠి ఏరియా ఆస్పత్రి, చెస్ట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ పేషెంట్లకే చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇతర సమస్యలతో బాధపడే వారు ఉస్మానియా, నిలోఫర్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సాధారణ జబ్బు ఏదొచ్చినా ఉస్మాని యా జనరల్‌ ఆస్పత్రికి రావడంతో అక్కడి వైద్య సిబ్బంది పై భారం పడుతోంది. ప్రమాదం జరిగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి తీవ్ర సమస్యలు వచ్చినా ఉస్మానియాలో చేర్చుకునేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లకు పైబడిన వారు ఏ ఇబ్బందితో వచ్చినా చేర్చుకోవడం లేదని ఫిర్యాదులొస్తున్నాయి. కిడ్నీ సమస్యతో వచ్చిన ఓ వృద్ధ రోగిని అత్యవసరమైతే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని ఉస్మానియా వైద్యులు ఉచిత సలహా ఇచ్చారు. తమ ఆస్పత్రిలో 200 బెడ్‌లతో కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేశామని, వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు న్న పేషెంట్లను చేర్చుకుంటే వారికి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఉస్మానియా వైద్యులు చెబుతున్నారు.


కరోనా లక్షణాలుంటే అంతే సంగతులు.. ఆయాసం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి కరోనా లక్షణాలతో వస్తే ఇక అంతే సంగతులు. వారికి ప్రాథమిక చికిత్స చే సేందుకూ వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌ ఉంటే ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేసే సాహసం చేయడం లే దు. రోగి చనిపోతే కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తారనే భయంతో అంబులెన్స్‌ నుంచి కిందకు దించకముందే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ వెనక్కి పంపిస్తున్నారు. నిమ్స్‌తో పాటు కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలోనూ చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. 


ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లోనూ గర్భిణులకు సైతం వైద్యం దొరకడం కష్టంగా మారింది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీజీలు, ప్రొఫెసర్లు, ఇతర ఇబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. పెట్లబురుజులో 34 మంది, నిమ్స్‌లో 135, ఉస్మానియాలో 10 మంది.. ఇలా అనేక మంది వైద్యులకు వైరస్‌ సోకింది. దీంతో 9 నెలలు నిండిన గర్భిణులకు మాత్రమే చికిత్స లభిస్తోంది. సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆ స్పత్రి, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిపోయింది. ఫలితం గా ముందు వచ్చిన వారిని అడ్మిట్‌ చేసుకొని మిగిలిన వారిని తిప్పి పంపిస్తున్నారు. చికిత్స అందించకపోవడంతో దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట నుంచి వచ్చిన వారు వారం  క్రితం సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. నిమ్స్‌లోకొన్ని విభాగాల్లోనే సేవలు అంతం త మాత్రంగానే లభిస్తున్నాయి. దాదాపు సగం మంది వైద్య సిబ్బంది క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. వారం రోజులకు ఒక బ్యాచ్‌ చొప్పు న వైద్యులు, ఇతర సిబ్బంది సేవలందిస్తున్నారు. సగం మంది వైద్యులు, సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉండటంతో ఒత్తిడి పెరుగుతోంది. అందరికి వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది.


రవీంద్రకు 65 ఏళ్లు. విపరీతమైన ఆయాసం. కరోనా లక్షణాలేమీ లేవు. అతణ్ని బంధువులు అంబులెన్స్‌లో నిమ్స్‌కు తీసుకొచ్చారు. అంబులెన్స్‌ నుంచి దించక ముందే ఆస్పత్రి సిబ్బంది వచ్చి ఏమైందని అడిగారు. ఆయాసం వస్తోందని చెప్పగానే ‘ఇక్కడ చికిత్స చేయడం లేదు. ఏదైనా ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అని ఉచిత సలహా ఇచ్చి వెళ్లిపోయారు. చేసేదేమీ లేక సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో డబ్బులు చెల్లించి చేర్చారు. 


కొత్తగూడెంకు చెందిన రంగరావు వయసు 45 ఏళ్లు. అతను చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. రెండ్రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఊపిరితిత్తుల సమస్య అనగానే కింగ్‌ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చేతులు దులుపుకున్నారు. 


మలక్‌పేటకు చెందిన మహిళ గైనిక్‌ సమస్యతో బాధపడుతోంది. అక్కడి ఏరియా ఆస్పత్రిలో కరోనా సమస్య తీవ్రంగా ఉండటంతో సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ రద్దీ వల్ల ఆ మహిళకు చికిత్స అందించేందుకు ఆస్పత్రి వర్గాలు ఆసక్తి చూపలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని గదామాయించారు. 

Updated Date - 2020-07-22T10:05:52+05:30 IST