చేనేత కార్మికులను ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2020-05-11T21:09:11+05:30 IST

చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పారు.

చేనేత కార్మికులను ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్

సిరిసిల్ల: చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రూ.14.50 కోట్లతో టెక్స్‌టైల్ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంపైనైనా సమగ్రంగా ఆలోచిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కరోనాతో కారణంగా కార్మికులు వెళ్లిపోతుంటే పరిశ్రమలు ఇబ్బందుల్లో పడతాయన్నారు. లాభాలు ఆర్జిస్తున్న యజమానులు కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవాలని సూచించారు. యజమానులు కార్మికులతో ఒప్పందం చేసుకున్న విధంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ పరంగా తామూ చేయుతనందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కేంద్రం సాయం కోరుతూ ఇప్పటికే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశామని చెప్పారు. 

Updated Date - 2020-05-11T21:09:11+05:30 IST