చేనేత సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
ABN , First Publish Date - 2020-09-12T09:13:10+05:30 IST
రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేవాల్లో చర్చించాలని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావు కోరారు.

పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబూరావు
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేవాల్లో చర్చించాలని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావు కోరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ చైౖర్మన్ గుండు సుధారాణి తదితరులకు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. అసెంబ్లీలో చేనేత సమస్యలపై చర్చ జరిగేలా మంత్రి కేటీఆర్‌ను కోరాలని బాబూరావు విజ్ఞప్తి చేశారు.