శానిటైజర్ లేకుంటే ఇది జేబులో పెట్టుకోండి.. రాచకొండ పోలీసులు

ABN , First Publish Date - 2020-03-21T19:18:16+05:30 IST

కరోనా వైరస్‌పై విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిలో రాచకొండ పోలీసులు ముందు వరుసలో ఉంటారు.

శానిటైజర్ లేకుంటే ఇది జేబులో పెట్టుకోండి.. రాచకొండ పోలీసులు

హైదరాబాద్: కరోనా వైరస్‌పై విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిలో రాచకొండ పోలీసులు ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో... ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. సిగ్నల్ పడ్డప్పుడు ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిల్చుని ప్రయాణీకులకు చేతులు కడుక్కోవడం గురించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.  తాజాగా మరో వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శానిటైజర్ లేకున్నా సబ్బుతో చేతులు కడుక్కోవచ్చని.. దాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్న విషయాన్ని చెబుతూ వీడియో షేర్ చేశారు. కరోనా వైరస్‌ను సబ్బు ఎలా నిర్మూలిస్తుందో ఆ వీడియోలో తెలుసుకోవచ్చు.


‘‘శానిటైజర్ లేకుంటే సబ్బు జేబులో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యం. ఇతరులు ముట్టుకొన్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను వెనుక ముందు కడుక్కోవటం మరువొద్దు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 



Updated Date - 2020-03-21T19:18:16+05:30 IST