సహాయక చర్యల్లో జీడబ్ల్యూఎంసీ

ABN , First Publish Date - 2020-08-16T10:01:53+05:30 IST

వర్షాలతో నగరం అతలాకుతలమైన నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది

సహాయక చర్యల్లో జీడబ్ల్యూఎంసీ

వరంగల్‌ సిటీ, ఆగస్టు 15: వర్షాలతో నగరం అతలాకుతలమైన నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రజల నుంచి ఫిర్యా దులు. రక్షణ, సహాయక చర్యల కోసం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ 18004251989తో పాటు 9100 908402, 9701999688, 9701999659 నెంబర్లు, వాట్సప్‌ నెంబర్‌ 7997100300 నెంబర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఈ నెంబర్లకు ఫోన్‌ చేసి సహాయక చర్యలు పొందవచ్చని అధికారులు సూచించారు.  


జీడబ్ల్యూఎంసీ నగరంలో 11పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను కేంద్రాలకు తరలిస్తున్నారు. 3500 మందికి పైగా పునరావస కేంద్రాలకు తరలించారు. భోజన వసతి కల్పించారు. ఖిలా వరంగల్‌ పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలను హాంటర్‌రోడ్డులోని- జేఎస్‌ఎం స్కూల్‌, టాలెంట్‌ స్కూల్‌కు తరలించారు. వరంగల్‌ ప్రాంతంలోని ప్రజలను శుభం గార్డెన్‌, సంతోషిమాత టెంపుల్‌, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌, పోతన కమ్యూనిటీ హాల్‌కు చేర్చారు.  హన్మకొండ పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలను పద్మాశాలి సంఘం ఫంక్షన్‌ హాల్‌, మాతా ఫంక్షన్‌ హాల్‌, శ్రీసాయి ఫంక్షన్‌ హాల్‌, విష్ణుప్రియ గార్డెన్స్‌, దీన్‌దయాళ్‌నగర్‌ ప్రాంతంలోని ఓ భవనానికి చేర్చారు. 


నగరంలో పలు ముంపు ప్రాంతాల్లో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతి పర్యటించారు. నాలాలు. వరద నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న అక్రమ భవనాలు, షెడ్డలను తొలగించాలని కమిషనర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-08-16T10:01:53+05:30 IST