గురుకులాల బ్యాక్‌లాగ్‌ వేకెన్సీ సెట్‌ ఫలితాలు నేడు

ABN , First Publish Date - 2020-06-19T10:14:22+05:30 IST

గురుకులాల బ్యాక్‌లాగ్‌ వేకెన్సీ(బీఎల్‌వీ) సెట్‌-2020 ఫలితాలు ఈ నెల 19న వెలువడనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల

గురుకులాల బ్యాక్‌లాగ్‌ వేకెన్సీ సెట్‌ ఫలితాలు నేడు

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గురుకులాల బ్యాక్‌లాగ్‌ వేకెన్సీ(బీఎల్‌వీ) సెట్‌-2020 ఫలితాలు ఈ నెల 19న వెలువడనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గౌలిదొడ్డి, కరీంనగర్‌ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కాలేజె్‌స)లలో 8వ తరగతి ప్రవేశాలు, రుక్మాపూర్‌లోని సైనిక్‌ సంక్షేమ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ఇతర గురుకులాల్లోని బ్యాక్‌లాగ్‌ వేకెన్సీల ఫలితాలు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. 1933 సీట్లకు 27,277 మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని, ఎంపికైన వారి మొబైల్‌ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇస్తామని చెప్పారు. 

Updated Date - 2020-06-19T10:14:22+05:30 IST