గురుకులాల 5వ తరగతి ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-12-05T08:36:43+05:30 IST

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశపరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి విడత ఎంపికజాబితాను గురుకులాల

గురుకులాల 5వ తరగతి ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశపరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి విడత ఎంపికజాబితాను గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలు, మెరిట్‌ జాబితాను ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.జీుఽ  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఈ నెల 7 నుంచి 19 వరకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. రిపోర్ట్‌ చేయని అభ్యర్థుల సీట్లను రెండో విడత ఎంపిక జాబితా ప్రకారం భర్తీ చేస్తామన్నారు.


5వ తరగతిలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా  46,937 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 18,560, గిరిజన గురుకులాల్లో 4,777, బీసీ గురుకులాల్లో 20,800, జనరల్‌ రెసిడెన్సియల్స్‌లో 2,800 సీట్లు ఉన్నాయని వివరించారు. 


Updated Date - 2020-12-05T08:36:43+05:30 IST