రైతుల కళ్లల్లో సంతోషం కన్పిస్తుంది: గండ్ర జ్యోతి
ABN , First Publish Date - 2020-07-08T10:43:32+05:30 IST
రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో చేరాయని, దీంతో ప్రతీఒక్క రైతు కళ్లల్లో సంతోషం కనిపిస్తోందని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు.

శాయంపేట, జూలై 7 : రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో చేరాయని, దీంతో ప్రతీఒక్క రైతు కళ్లల్లో సంతోషం కనిపిస్తోందని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా మండల కేంద్రానికి చెందిన రైతులకు ఉచితంగా వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరైన సమయానికి వర్షాలు పడడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనావాణి, ఏవో గంగాజమున, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, సర్పంచ్ రవి, పీఏసీఎస్ చైర్మన్ శరత్, తదితరులు పాల్గొన్నారు.