ఆమరణ దీక్ష చేపట్టిన తెలంగాణ ఉద్యమకారుడు గుండా రవీందర్

ABN , First Publish Date - 2020-07-14T18:11:06+05:30 IST

మంచిర్యాల: దండేపల్లిలో తెలంగాణ ఉద్యమ కారుడు గుండా రవీందర్ ఆమరణ దీక్ష చేపట్టారు.

ఆమరణ దీక్ష చేపట్టిన తెలంగాణ ఉద్యమకారుడు గుండా రవీందర్

మంచిర్యాల: దండేపల్లిలో తెలంగాణ ఉద్యమ కారుడు గుండా రవీందర్ ఆమరణ దీక్ష చేపట్టారు. తన ఇంటి ఆవరణలోని కేసీఆర్ గుడి వద్ద రవీందర్ దీక్ష బూనారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆస్తులు కోల్పోయిన తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసీఆర్ దర్శన భాగ్యం అయినా కలిపించాలని వేడుకుంటున్నారు.


గుండా రవీందర్ గతంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముందు హల్‌చల్‌ చేశాడు. 2001 నుంచి తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆత్మహత్యకు యత్నించాడు. ఉద్యమకారుడైన తనకు ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


Updated Date - 2020-07-14T18:11:06+05:30 IST