గల్ఫ్ ఆయిల్ రూ. 50 లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-04-25T08:49:23+05:30 IST
రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు మద్దతుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఎండీ సుభాష్ రూ. 50 లక్షలు, ఇండస్ ఇండ్ ..

50 లక్షలిచ్చిన ఇండస్ ఇండ్ బ్యాంకు
మంత్రి కేటీఆర్‌కు చెక్కులు అందజేత
కూకట్‌పల్లి/బర్కత్‌పుర, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు మద్దతుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఎండీ సుభాష్ రూ. 50 లక్షలు, ఇండస్ ఇండ్ బ్యాంకు రీజనల్ హెడ్ వినోద్ రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు చెక్కులను అందజేశారు. దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించిన కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ నేత అభిలా్‌షరావును కేటీఆర్ అభినందించారు. కాగా, ముద్ర అగ్రికల్చర్, స్కిల్ డెవల్‌పమెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పీఎం కేర్స్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది.