జయశంకర్‌వర్సిటీని సందర్శించిన గుజరాత్‌ బృందం

ABN , First Publish Date - 2020-12-25T08:43:02+05:30 IST

ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుజరాత్‌ ఉన్నతాధికారుల బృందం గురువారం సందర్శించింది

జయశంకర్‌వర్సిటీని సందర్శించిన గుజరాత్‌ బృందం

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుజరాత్‌ ఉన్నతాధికారుల బృందం గురువారం సందర్శించింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అంజూశర్మ, ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్‌ ఎం.నాగరాజన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్‌రావుతో భేటీ అయ్యారు. బోధన, పరిశోధన, ఇటీవల 11 వ్యవసాయ అంకుర సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం తదితర అంశాల గురించి వీసీ వివరించారు. 

Updated Date - 2020-12-25T08:43:02+05:30 IST