లాక్‌డౌన్‌లో నిరుపేదలకు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చేయూత
ABN , First Publish Date - 2020-05-24T17:45:26+05:30 IST
లాక్ డౌన్‌లో శ్రీమతి గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ పేదలకు ఆపన్న హస్తం అందిస్తోంది.

హైదరాబాద్: లాక్ డౌన్‌లో శ్రీమతి గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ పేదలకు ఆపన్న హస్తం అందిస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో రంజాన్ మాసం సందర్భంగా 500 ముస్లిం కుటుంబాలకు బియ్యం, సేమియా, పాలు, చక్కెర, డ్రై ప్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పాల్గొన్నారు. 51 రోజులుగా 10 వేల కుటుంబాలకు నిత్యవసర సరుకుల కిట్లు పంపిణీ చేసిన ధనలక్ష్మి ట్రస్ట్‌ను అభినందించారు. కరోనా కష్టకాలంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం తప్పక పాటించాలని గాంధీ అన్నారు.