నేడు ‘గుడికో గోమాత’ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-10T08:15:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో గురువారం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించనుంది. హైదరాబాదు నగరం జూబ్లిహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక ఆవు, దూడను ఉదయం 9 గంటలకు టీటీడీ ఛైర్మన్‌

నేడు ‘గుడికో గోమాత’ ప్రారంభం

తిరుపతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో గురువారం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించనుంది. హైదరాబాదు నగరం జూబ్లిహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక ఆవు, దూడను ఉదయం 9 గంటలకు టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అందించనున్నారు. గో సంరక్షణ, ప్రతి గుడిలోనూ పూజలు నిర్వహించేలా ఈ కార్యక్రమాన్ని ఇటీవల విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి గుడికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని టీటీడీ పిలుపునిచ్చింది.


Updated Date - 2020-12-10T08:15:19+05:30 IST