గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియామీర్జా
ABN , First Publish Date - 2020-06-23T20:29:13+05:30 IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇచ్చిన ఛాలెంజ్‌ను టెన్నిస్‌స్టార్ సానియామీర్జా స్వీకరించారు.

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇచ్చిన ఛాలెంజ్‌ను టెన్నిస్‌స్టార్ సానియామీర్జా స్వీకరించారు. ఫిలింనగర్‌లోని తన కార్యాలయం ఆవరణలో సానియా మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ గ్రీన్‌ఛాలెంజ్ పేరుతో ఒక మంచి కార్యక్రమాన్నిచేపట్టారని అన్నారు. దీని వల్ల మనం ప్రకృతిని రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంది. ఈసందర్భంగా సానియా మీర్జా భారత మాజీ క్రికెట్‌కెప్టెన్ అజాహరుద్దీన్, ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు గ్రీన్‌ఛాలెంజ్‌ను ఇస్తున్నట్టు తెలిపారు.