‘గ్రేటర్’ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-09-12T09:19:58+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో

హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యకుడు అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.
దీనికి హాజరైన ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో రోడ్లు అధ్వాన్నంగా మారినా పట్టించుకోవడం లేదన్నారు. పేదలకు డబులు బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఖైరతాబాద్ నిజయోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, అందులో భాగంగానే నేడు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరుగాంచిందని తెలిపారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ నిజయోజకవర్గంలోని అన్ని డివిజన్లకు కాంగ్రెస్ నూతన అధ్యకులను నియమించారు. కమ్మరి వెంకటేశ్ (ఖైరతాబాద్), ఇంద్రారావు (హిమాయత్ నగర్), నారికేళ నరేశ్ (సోమాజిగూడ), కట్టూరి రమేశ్ (జూబ్లీహిల్స్), ధనరాజ్ రాథోడ్ (బంజారాహిల్స్), వెంకటేశ్వర నగర్ డివిజన్ అధ్యకుడిగా శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారు.