గ్రేటర్‌లో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

ABN , First Publish Date - 2020-11-20T00:23:30+05:30 IST

గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను..

గ్రేటర్‌లో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడంతో నగరంలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. అభ్యర్థుల తరపున వచ్చిన అనుచరులు, కార్యకర్తలతో రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద 100 మీటర్ల వరకూ ఆంక్షలు విధించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులను మాత్రమే రిటర్నింగ్ కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-11-20T00:23:30+05:30 IST