నియంతృత్వ పాలనకు చెక్‌పెట్టిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు

ABN , First Publish Date - 2020-12-06T08:11:57+05:30 IST

హామీలను తుంగలో తొక్కేవారికి, నియంతృత్వ పాలన చేసే వారికి గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు చెక్‌ పెట్టినట్లుగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర

నియంతృత్వ పాలనకు చెక్‌పెట్టిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ 

 హైదరాబాద్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): హామీలను తుంగలో తొక్కేవారికి, నియంతృత్వ పాలన చేసే వారికి గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు చెక్‌ పెట్టినట్లుగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ఎన్నికల ఫలితాలపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల మెప్పు పొందే విషయమై   పార్టీలో చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల హామీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీల అమలు కోసం టీడీపీ శ్రేణులు పోరాడుతున్నట్లు చెప్పారు. 


లోపాయకారి ఒప్పందాలతో ఎవరెవరు ఎలా వ్యవహరించారో  మేయర్‌ ఎన్నికలో తేలుతుందన్నారు. స్థానిక ఎన్నికల కోసం కేంద్ర హోం మంత్రి, ఇతర రాష్ట్రాల సీఎంలు రావడం ఎప్పుడూ చూడలేదని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అర్వింద్‌ కుమార్‌ అన్నారు. సంస్థాగత కమిటీల ఏర్పాటుతో రానున్న ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌ రావు చెప్పారు.  రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి సైకిల్‌ యాత్ర చేపట్టనున్నట్లు తెలుగుయువత అధ్యక్షుడు పొగాకు జయరాం ప్రకటించారు. 


Read more