12 ఎన్‌హెచ్‌లను మంజూరు చేయండి

ABN , First Publish Date - 2020-12-19T07:19:54+05:30 IST

తెలంగాణ విషయంలో పెండింగ్‌లో ఉన్న 12 జాతీయ రహదారులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర

12 ఎన్‌హెచ్‌లను మంజూరు చేయండి

కేంద్ర ప్రభుత్వానికి వినోద్‌ కుమార్‌ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విషయంలో పెండింగ్‌లో ఉన్న 12 జాతీయ రహదారులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ కోరారు. అలాగే, ఇప్పటికే మంజూరైన 13 జాతీయ రహదారులకు సంబంధించిన పనుల్ని వెంటనే ప్రారంభించాలని కోరారు.

జాతీయ రహదారుల మంజూరు విషయంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి వినోద్‌ కుమార్‌ నాలుగు పేజీల లేఖను రాశారు. 


Read more