ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి: తలసాని
ABN , First Publish Date - 2020-10-04T22:31:38+05:30 IST
ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్: ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ కాలేజి సమీపంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ెస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2017 సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ పేర్లను ఓటరుగా నమోదు చేయించుకోవాలని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ కు చెందిన పలువురు అసిస్టెంట్ ప్రొపెసర్ లు, అద్వకేట్స్, పలు కాలనీలకు చెందిన గ్రాడ్యుయేట్స్ సుమారు 350 మంది ఓటరు నమోదు కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.