పత్రికలను బెదిరిస్తే సర్కారుకే నష్టం: కోదండ

ABN , First Publish Date - 2020-04-08T09:51:51+05:30 IST

సమాజంలో ఉండే సమస్యలను మీడియా కాకపోతే ఇంకెవరు వెలుగులోకి తెస్తారని, విమర్శనాత్మక వార్తలు రాసే స్వేచ్ఛను పత్రికలకు ఇవ్వాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం విలేకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మీడియాపై...

పత్రికలను బెదిరిస్తే సర్కారుకే నష్టం: కోదండ

  • కేసీఆర్‌ది నియంతృత్వ ధోరణి: శ్రీనివాస్‌ రెడ్డి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ఉండే  సమస్యలను మీడియా కాకపోతే ఇంకెవరు వెలుగులోకి తెస్తారని, విమర్శనాత్మక వార్తలు రాసే స్వేచ్ఛను పత్రికలకు ఇవ్వాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం విలేకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మీడియాపై చేసిన వ్యాఖ్యల  మీద కోదండరాం స్పందించారు. పత్రికా స్వేచ్ఛను అణచివేస్తే సమాజం నుంచి కావాల్సిన సమాచారం ప్రభుత్వానికి చేరదని.. ఆ రకంగా అది ప్రభుత్వానికే నష్టమని పేర్కొన్నారు.  మీడియా పట్ల కేసీఆర్‌ వైఖరి అనుచితంగా ఉందని.. ఆయన ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారేమీ కాదన్నారు. ప్రశ్నలు అడిగే మీడియా ప్రతినిధులను విసుక్కోవడం, దబాయింపు ధోరణితో వారిని మాట్లాడనివ్వకపోవడం ఆయన తరచూ చేస్తున్నారని విమర్శించారు. మీడియా ప్రతినిధులపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి ఖండించారు. కరోనాపై పోరులో తప్పులు ఎత్తిచూపుతూ పత్రికల్లో వార్తలు రాస్తే వారికి కరోనా రావాలంటూ శపించడం సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని అన్నారు. 


Updated Date - 2020-04-08T09:51:51+05:30 IST