ఆదివాసీలకు పెద్దపీట: సత్యవతి

ABN , First Publish Date - 2020-08-09T07:48:29+05:30 IST

ప్రభుత్వం ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, జాతర్లను ఘనంగా నిర్వహిస్తోందని, వారి సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు...

ఆదివాసీలకు పెద్దపీట: సత్యవతి

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, జాతర్లను ఘనంగా నిర్వహిస్తోందని, వారి సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆదివారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల పండుగల నిర్వహణకు సర్కారు రూ. 1.25కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.75 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను 6-10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.



Updated Date - 2020-08-09T07:48:29+05:30 IST