రోగ నిరోధక శక్తిని పెంచే వంగడాలు సృష్టించండి-గవర్నర్
ABN , First Publish Date - 2020-06-26T01:09:18+05:30 IST
రోగ నిరోధక శక్తిని మానవ శరీరంలో అభివృద్ది చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసి అలాంటి పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయరంగ పరిశోధకులకు గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రోగ నిరోధక శక్తిని మానవ శరీరంలో అభివృద్ది చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసి అలాంటి పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయరంగ పరిశోధకులకు గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ పిలుపునిచ్చారు. మన ముందు తరాలు అన్నం తిని ఎక్కువ సంవత్సరాలు జీవించారు. కానీ ఇప్పటి తరం అన్నంతో మధుమేహం వస్తుందని రైస్‌కు దూరంగా ఉంటున్నారు. వరి వంగడాలను శాస్ర్తీయంగా పరిశోధించి వాటిలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని గవర్నర్ కోరారు. గురువారం జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్‌భవన్ నుంచి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేసిన తెలంగాణ సోనా అనేక ప్రత్యేక వెరైటీని ప్రోత్సహించడం ద్వారా యువతకు కూడా అన్నానికి దగ్గర చేయవచ్చని ఆరకంగా మన దక్షణభారతదేశ సంప్రదాయాన్ని కూడా కాపాడుకోవచ్చని అన్నారు.
తాటి చెట్టును తరతరాలుగా మన పూర్వీకులు ఒక కల్పవృక్షంగా భావిస్తున్నారని, ఆ చెట్టు ప్రతి భాగం కూడా ఎన్నోరకాలుగా ఉపయోగ పడుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ చెట్లను కాపాడుకోవడంతో పాటు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని గవర ్నర్ సూచించారు. నీరా పానీయం ఎంతో పోషకాహార విలువలు కలిగి ఉందని ఈ పానీయాన్ని ఎక్కువ కాలం పోషక విలువలు పోకుండా నిలువ వుంచే విధంగా పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు. తాటి చెట్టు ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేసే కుటీర పరిశ్రమలు తమిళనాడు, కేరళలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, అలాగే తాటిచెట్టు తమిళనాడు రాష్ట్ర అధికారిక చెట్టు అని గవర్నర్ తెలిపారు. అనారోగ్యకరమైన కొన్ని వంటనూనెలతోనే ఆనేక రోగాలు మొదలవుతున్నాయని
ఒక డాక్టర్‌గా తన అనుభవంలో గమనించినట్టు తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన వంటనూనెల ఉత్పత్తిలో విస్తృత పరిశోధనలు జరగాలని వ్యవసాయ, ఉద్యానవన పరిశోధకులకు గవర్నర్ సూచించారు. నేటి రోజుల్లో ఆహారపు అలవాట్లలో విపరీతపోకడలు వస్తున్నాయని, వ్యవసాయ శాస్త్రవేత్తలు సరైన ఆహారపు అలవాట్లపై అవగామన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య వంతులను చేయాలని గవర్నర్ కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరీ సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ సీఎస్ రఘు ప్రసాద్, అనుసంధాన అధికారి సిహెచ్ సీతారాములు, డా. కె. రాజారామ్, వ్యవసాయ వివ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.