సంఘటితంగా ఎదుర్కొందాం: గవర్నర్‌

ABN , First Publish Date - 2020-04-28T09:28:15+05:30 IST

కరోనాను సంఘటితంగా ఎదుర్కొందామని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య భద్రతా

సంఘటితంగా ఎదుర్కొందాం: గవర్నర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కరోనాను సంఘటితంగా ఎదుర్కొందామని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ రంగంలో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాజ్‌భవన్‌లో మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. సిబ్బంది నివాస సముదాయంలో ఆంక్షలు విధించారు. ఉద్యోగులను తప్ప ఎవరినీ బయటకు వెళ్లనీయడం లేదు. పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాల వ్యాపారులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-04-28T09:28:15+05:30 IST