కరోనాతో ఎవరూ చనిపోకూడదు.. అదే నా లక్ష్యం: గవర్నర్
ABN , First Publish Date - 2020-07-18T22:28:52+05:30 IST
తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని.. అదే తన లక్ష్యమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని

హైదరాబాద్: తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని.. అదే తన లక్ష్యమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని చెప్పారు. అలాగే ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా డోనార్స్ ఈఎస్‌ఐ ఆస్పత్రికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనార్ సంతోష్‌కు పుష్ప గుచ్ఛం ఇచ్చి గవర్నర్ అభినందించారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా భౌతిక దూరం పాటించినందుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని గవర్నర్ సూచించారు.