శభాష్ సీతక్క... కొనియాడిన గవర్నర్
ABN , First Publish Date - 2020-04-21T08:16:04+05:30 IST
ములుగు ఎమ్మెల్యే సీతక్కను గవర్నర్ తమిళిసై అభినందించారు. లాక్‌డౌన్ కారణంగా తిండి దొరక్క అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలు, ఆదివాసీల కడుపు నింపుతున్న సీతక్క సేవలను ట్విటర్ వేదికగా గవర్నర్ కొనియాడారు.

ములుగు/హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ములుగు ఎమ్మెల్యే సీతక్కను గవర్నర్ తమిళిసై అభినందించారు. లాక్‌డౌన్ కారణంగా తిండి దొరక్క అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలు, ఆదివాసీల కడుపు నింపుతున్న సీతక్క సేవలను ట్విటర్ వేదికగా గవర్నర్ కొనియాడారు. ‘సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో ఆమె సేవలను ప్రత్యక్షంగా చూశాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా సీతక్క గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘మీరు సహకరిస్తే ఎంత కష్టమైనా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా’నని రిట్వీట్ చేశారు. అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా.. సీతక్క సేవలు భేష్ అంటూ ప్రశంసించారు. సోమవారం చంద్రబాబు జన్మదినం సందర్భంగా సీతక్క ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలపగా.. ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. సీతక్క సేవలను కొనియాడుతూ అభినందించారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.