సక్రమంగా ఆదాయపన్ను చెల్లింపుతో దేశాభివృద్ధి- గవర్నర్
ABN , First Publish Date - 2020-12-05T21:30:46+05:30 IST
సక్రమంగా ఆదాయపన్ను చెల్లింపు ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.

హైదరాబాద్: సక్రమంగా ఆదాయపన్ను చెల్లింపు ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఆదాయపన్ను ద్వారా లభిస్తోందన్నారు.కాబట్టి ప్రజలు కూడా సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించడం వల్ల సంక్షేమపధకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు దోహదం చేసిన వారవుతారని అన్నారు. ఆల్ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ (ఎఐఎఫ్‌టిపి) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు గవర్నర్ తమిళిసై వర్చువల్ మోడ్‌లో రాజ్‌భవన్ నుంచి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకంగా ఆదాయ పన్ను చెల్లించడం కూడా దేశం పట్ల అభిమానం ఉన్నట్టేనని చెప్పారు. జాతీఅభివృద్ధికి ఇది దోహదం చేస్తుందన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలోని 1.30 కోట్ల పన్నుచెల్లింపు దారుల్లో 1.5 కోట్లమంది మాత్రమే సక్రమంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారని అన్నారు. సిబిడిటీ నివేదిక ప్రకారం దేశంలో 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయపన్నురిటర్న్లు ఫైల్‌చేసిన వారిలో 5.78 కోట్ల మంది మాత్రమే ఉన్నారని , మరో 1.46 కోట్ల మంది ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలేదని తెలిపారు.
దేవంలో ఆదాయపన్ను విధానం ప్రజామోదకంగా ఉంద ని, మరింతగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టాక్స్ ప్రాక్టీషనర్స్ కూడా ఈ విషయంలో మరింతగా కృషి చేసి పన్ను చెల్లింపు దారులకు అవగామన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.