ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణాలకు సబ్సిడీ...

ABN , First Publish Date - 2020-06-20T01:08:57+05:30 IST

పంటోత్పత్తులను ఆరబెట్టుకునేందుకుగాను కల్లాల(డ్రైయింగ్ ప్లాట్ ఫారం) నిర్మాణానికి సహకారాన్నందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు... సన్న, చిన్నకారు రైతులు / స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. ఇక కల్లాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల కొలతలుంటాయని అధికారులు వెల్లడించారు. మొదటి రకం 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. అంచనా విలువ రూ. 56 వేలు.

ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణాలకు సబ్సిడీ...

హైదరాబాద్ : పంటోత్పత్తులను ఆరబెట్టుకునేందుకుగాను కల్లాల(డ్రైయింగ్ ప్లాట్ ఫారం) నిర్మాణానికి సహకారాన్నందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు... సన్న, చిన్నకారు రైతులు / స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. ఇక కల్లాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల కొలతలుంటాయని అధికారులు వెల్లడించారు. మొదటి రకం 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. అంచనా విలువ రూ. 56 వేలు. 


రెండవ రకం 60 చదరపు మీటర్లు. అంచనా విలువ రూ. 68 వేలు. మూడవ రకం 75 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మించుకోవచ్చు. ఇక అంచనా విలువ రు. 85 వేలు. కాగా... ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన    రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 % చొప్పున సబ్సిడీలు ఉంటాయి. రైతులు వీటి కోసం సంబంధిత సహాయ వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-06-20T01:08:57+05:30 IST