డిస్కమ్‌లకు 833.33కోట్లు
ABN , First Publish Date - 2020-09-01T08:48:15+05:30 IST
విద్యుత్తు డిస్కమ్‌లకు టారిఫ్ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు నెలకుగాను ముందస్తుగా

- టారిఫ్ సబ్సిడీని విడుదల చేసిన సర్కారు
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు డిస్కమ్‌లకు టారిఫ్ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు నెలకుగాను ముందస్తుగా రూ.833.33 కోట్లను విడుదల చేస్తూ ఇంధన శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వీటిలో 24 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు, గృహ వినియోగదారులకు రాయితీపై కరెంటు, ఎత్తిపోతల పథకాల విద్యుత్తు వినియోగానికి సంబంధించిన ఛార్జీలు కలిపి ఉన్నాయి. కాగా, విద్యుత్తు నియంత్రణ మండలిలో ఛైర్మన్, సభ్యులతో పాటు ఉద్యోగుల వేతనాల కోసం తొలి, రెండో త్రైమాసికం కింద రూ.3.32 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక తెలంగాణ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సరెడ్‌కో)కు వేతనాల కింద రూ.4.87 కోట్లను విడుదల చేశారు.