ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటరు దాఖలు
ABN , First Publish Date - 2020-11-22T02:34:20+05:30 IST
ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం చట్టాలను సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది

హైదరాబాద్: ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం చట్టాలను సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాల్టీ, జీహెచ్ఎంసీ చట్టాలను సవరించాం. ధరణిలో కోటీ ఆరు లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజికవర్గం వివరాలు మాత్రమే సేకరిస్తాం. సేకరించిన వివరాలన్నీ రాష్ట్ర డేటా సెంటర్‌లో భద్రంగా ఉంటాయి. వ్యవసాయేతర ఆస్తుల యజమానుల ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయం. వ్యవసాయ భూములకు రైతుబంధు వంటి సబ్సిడీ పథకాలు అమలవుతున్నాయి. సాగు భూముల యాజమానుల ఆధార్ వివరాల సేకరణ తప్పేమీ కాదు’ అని న్యాయస్థానానికి ప్రభుత్వం వెల్లడించింది. ధరణిపై మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని హైకోర్టును సర్కార్ కోరింది.