చికెన్, మటన్ వ్యాపారస్తులకు ప్రభుత్వం హెచ్చరికలు

ABN , First Publish Date - 2020-05-10T01:05:05+05:30 IST

చికెన్, మటన్ వ్యాపారస్తులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మటన్ కేజీ

చికెన్, మటన్ వ్యాపారస్తులకు ప్రభుత్వం హెచ్చరికలు

హైదరాబాద్: చికెన్, మటన్ వ్యాపారస్తులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మటన్ కేజీ రూ.700, చికెన్, గుడ్ల ధరలు ఎన్‌ఈసీ సూచించిన మేరకు అమ్మాలని చెబుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే భారీగా జరిమానాలు, సీజ్‌లు తప్పవని చెబుతున్నారు. వినియోగదారులు తప్పక బిల్లులు తీసుకోవాలని అధికారుల విజ్ఙప్తి చేశారు. అధిక ధరలకు విక్రయించినా, తూకంలో తేడాలున్నా, పరిశుభ్రత లేకున్నా 9848747788 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని అధికారులు సూచించారు.


రాష్ట్రంలో చికెన్‌, మటన్‌ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా ఎన్నడూ లేనంత రేట్లకు అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై మాంసాహార వంటకాలు ఎక్కువగా చేస్తుండటంతో ఇప్పటికే వినియోగం పెరిగింది. దీనికితోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే మటన్, చికెన్, గుడ్లు ఎక్కువగా తినాలి  అని వైద్యులు చెబుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. చికెన్‌, మటన్‌పైనే కాకుండా చేపలపై రేట్లు పెంచుతూ పోతున్నారు. ప్రస్తుతం మటన్‌ ధర రూ. 800, చికెన్ ధర రూ. 200లకు పైగా ఉంది. అయితే ఈ రెండు కొడెంక్కి కూర్చున్నాయి. గుడ్ల ధర మాత్రం సామాన్యుడి అందుబాటులో ఉంది. 


ఒకవైపు ప్రభుత్వం మాంసం వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అదే క్రమంలో ధరలను నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం కూరగాయల ధరలను నియంత్రించేందుకు హైదరాబాద్‌లో సంచార రైతు బజార్లు ఏర్పాటుచేసింది. అదే క్రమంలో మాంసం ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-05-10T01:05:05+05:30 IST